Rishabh Pant in Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పటేల్, ఫొటోలు దిగేందుకు ఎగబడిన జనాలు
వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఈ ఇద్దరితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. గాయాల కారణంగా పంత్, అక్షర్‌లు ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.గతేడాది చివర్లో కార్ యాక్సిడెంట్‌కు గురైన పంత్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉండగా.. అక్షర్ ఇటీవలే వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాక గాయపడ్డాడు. అక్షర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు ఎంపికయ్యాడు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)