CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన పీవీ సింధు, ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో 56 కు చేరిన భారత్ మొత్తం పతకాలు సంఖ్య

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో పీవీ సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.

PV Sindhu

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో పీవీ సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్ లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్ లో 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత్ షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది. అంతకు ముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజత పతకం సాధించింది.ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో ఆరు స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement