CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం, హైజంప్‌లో దేశానికి తొలిసారిగా కాంస్య పతకం అందించిన తేజస్విన్‌ శంకర్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు సృష్టించాడు.

Tejaswin Shankar Wins India's First-Ever Bronze Medal

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు.న్యూజిలాండ్‌కు చెందిన హమీష్‌ కెర్‌ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్‌ స్టార్క్‌ సిల్వర్‌ సాధించాడు.తాజా పతకంతో భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now