Clashes at Football Match: వీడియో ఇదిగో, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌‌లో ఘోరంగా తన్నుకున్న అభిమానులు, 100 మందికి పైగా మృతి, రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అవడమే కారణం

పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్‌ నిర్వహించారు.

Clashes at a football match in Guinea (photo- Guineeinfos.com_

పశ్చిమాఫ్రికా దేశం గినియాలో  ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ (Football Match) మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు.

ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కొందరు పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Clashes at a football match in Guinea

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)