Kylian Mbappe Transfer News: జాక్ పాట్ కొట్టేసిన పుట్‌బాల్ దిగ్గజం కైలియన్ ఎంబాపే, అతని కోసం 332 మిలియన్ డాలర్లు బిడ్ దాఖలు చేసిన సౌదీ అరేబియా క్లబ్
సౌదీ అరేబియా క్లబ్ అల్-హిలాల్ PSG నుండి కైలియన్ Mbappeకి సంతకం చేయడానికి $332 మిలియన్ల భారీ బిడ్‌ను దాఖలు చేసింది. PSG ఇటీవలే ఫ్రాన్స్ స్ట్రైకర్‌ని ఆసియాలో వారి ప్రీ-సీజన్ పర్యటన నుండి విడిచిపెట్టింది, అతను తన ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని స్పష్టం చేశాడు,
ఫ్రాన్స్ వరల్డ్ కప్ హీరో కైలియన్ ఎంబాపే(Kylian Mbappe,)కు బంపర్ ఆఫర్ వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(All Hilal) క్లబ్ అతడికి రికార్డు స్థాయిలో డబ్బులు ఇస్తామని ప్రకటించింది. తమ క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంటే 332 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 2వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది.ఒకవేళ ఎంబాపే ఈ డీల్‌కు అంగీకరిస్తే అత్యంత ఎక్కువ ధర పలికిన ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ఎంబాపే ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్(PSG)కు ఆడుతున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్టు ముగియనుంది. దాంతో, వచ్చే సీజన్‌లో క్లబ్‌ను వీడుతున్నట్టు ఇప్పటికే అతను యాజమాన్యానికి చెప్పేశాడు. అందుకని ఈ స్టార్ ఆటగాడిని సొంతం చేసుకునేందుకు పలు క్లబ్స్ పోటీ పడుతున్నాయి. అయితే.. అల్ హిలాల్ క్లబ్ రేసులో అందరికంటే ముందు ఉన్నట్టు తెలుస్తోంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)