Indian Bridge Team Safe in Pakistan: భారత బ్రిడ్జ్‌ జట్టు పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉంది, వదంతులు నమ్మవద్దని కోరిన BFI చీఫ్‌ సుతాను బెహురియా

బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియా అండ్‌ మిడిల్‌ ఈస్ట్‌ (BFAME) ఆర్గనైజ్‌ చేస్తున్న 22వ ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న 32 మంది సభ్యుల భారత బ్రిడ్జ్‌ జట్టు సురక్షితంగా ఉందని బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (BFI) చీఫ్‌ సుతాను బెహురియా వెల్లడించారు.

Indian Bridge team (Photo-Twitter)

బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియా అండ్‌ మిడిల్‌ ఈస్ట్‌ (BFAME) ఆర్గనైజ్‌ చేస్తున్న 22వ ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న 32 మంది సభ్యుల భారత బ్రిడ్జ్‌ జట్టు సురక్షితంగా ఉందని బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (BFI) చీఫ్‌ సుతాను బెహురియా వెల్లడించారు. టీమిండియా టోర్నీ ముగిసిన తర్వాతే (మే 13) భారత్‌కు బయల్దేరుతుందని ఆయన స్పష్టం చేశారు.

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత పాక్‌లో చెలరేగుతున్న అల్లర్లలో భారత బృందం అవస్థలు పడుతుందని, టోర్నీ పూర్తికాకుండానే టీమిండియా భారత్‌కు బయల్దేరిందని వస్తున్న వదంతుల నేపథ్యంలో బెహురియా ఈ మేరకు స్పందించారు. సోషల్‌మీడియాలో జరుగుతున్నది ఫేక్‌ ప్రచారమని కొట్టిపారేశారు. భారత బృందం హోటల్‌లో సేఫ్‌గా ఉందని, పాక్‌ భద్రతా యంత్రాంగం ప్రత్యేక దళాలను మొహరించి టీమిండియాకు సెక్యూరిటీ ఇస్తుందని తెలిపారు.

Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)