Hockey Player Varun Kumar: ఆ భారత ఆటగాడు ఐదేళ్లుగా నాపై అత్యాచారం చేస్తున్నాడు, హకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
గత ఐదేళ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Varun Kumar Accused of Raping Minor Girl: భారత హాకీ జట్టు క్రీడాకారుడు (Hockey Player), అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ (Varun Kumar)పై అత్యాచారం కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌తో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఐదేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.కోచింగ్ క్యాంపుల కోసం బెంగళూరులోని సాయి స్టేడియంకు వచ్చిన సమయంలో వరుణ్ తనతో సెక్స్ చేసేవాడని ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని జ్ఞాన భారతి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)