Junior Asia Cup 2023: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్, 4వ సారి జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ కైవసం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. మూడు టైటిళ్లతో పాక్ రెండో స్థానానికి పరిమితమైంది.
జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. మూడు టైటిళ్లతో పాక్ రెండో స్థానానికి పరిమితమైంది. గురువారం ఫైనల్లో భారత్ 2-1 తేడాతో పాక్‌పై విజయం సాధించింది. అంగద్ వీర్ సింగ్ (13వ నిమిషంలో), అరిజీత్ సింగ్ (20వ) చెరో గోల్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి తరపున అలీ బషారత్ (38వ) గోల్ కొట్టాడు.
పురుషుల జూనియర్ ఆసియా కప్‌లో అద్భుతమైన విజయం సాధించినందుకు మా జూనియర్ పురుషుల హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. వారి విజయం మన యువత కలిగి ఉన్న అభివృద్ధి చెందుతున్న ప్రతిభను మరియు సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. వారు భారతదేశం గర్వించేలా చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)