Neeraj Chopra: భారత్‌కు పెద్ద షాక్, కామన్వెల్త్ క్రీడల నుండి వైదొలిగిన నీరజ్ చోప్రా, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా దూరమయ్యారని తెలిపిన రాజీవ్ మెహతా
కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్‌హోంలో ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి.
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ నుండి వైదొలిగాడు. కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్‌హోంలో ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా వందశాతం ఫిట్‌గా లేనందున క్రీడలకు దూరమవుతున్నాడని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రాజీవ్ మెహతా ధ్రువీకరించారు. ఇటీవల నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. అంజు బాబీ జార్జ్ (2003) తర్వాత పతకాన్ని అందించిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలోనే నీరజ్ చోప్రా గాయపడ్డాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)