Paralympics 2024: పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం, కాంస్యంతో చ‌రిత్ర తిర‌గ‌రాసిన అథ్లెట్ ప్రీతి పాల్, ట్రాక్ విభాగంలో దేశానికి ఇదే తొలి ప‌త‌కం

శుక్ర‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల 100 మీట‌ర్ల టీ35 ఫైన‌ల్లో ప్రీతి కాంస్యం ప‌త‌కం కొల్ల‌గొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం చేరింది. 100 మీట‌ర్ల ఫైన‌ల్లో ప్రీతి చిరుత‌లా ప‌రుగెత్తింది. 14.21 సెక‌న్ల‌లో ల‌క్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది.

Preethi Pal wins bronze in women’s 100m T35, first medal for India in track event at Para Games

పారాలింపిక్స్‌లో భార‌త క్రీడాకారులు ప‌త‌కాల వేట కొన‌సాగిస్తున్నారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో పారా షూట‌ర్లు అవ‌నీ లేఖ‌రా(Aanvi Lekhari) ప‌సిడితో గర్జించ‌గా మోనా అగ‌ర్వాల్(Mona Agarwal) కంచు మోత మోగించింది. వీళ్ల స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్(Preethi Pal) సంచల‌నం సృష్టించింది. ట్రాక్ విభాగంలో దేశానికి తొలి ప‌త‌కం సాధించి పెట్టింది. శుక్ర‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల 100 మీట‌ర్ల టీ35 ఫైన‌ల్లో ప్రీతి కాంస్యం ప‌త‌కం కొల్ల‌గొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మూడో ప‌త‌కం చేరింది. 100 మీట‌ర్ల ఫైన‌ల్లో ప్రీతి చిరుత‌లా ప‌రుగెత్తింది. 14.21 సెక‌న్ల‌లో ల‌క్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది. పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)