Commonwealth Games 2022: కామన్‌వెల్త్ గేమ్స్ లో భారత్‌కు తొలి స్వర్ణం, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు గోల్డ్, మూడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే...
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 27 ఏళ్ల మీరాబాయి మొత్తమ్మీద 201 కేజీలు లిఫ్ట్ చేసి రికార్డు సృష్టించింది.
Birmingham, July 31: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 27 ఏళ్ల మీరాబాయి మొత్తమ్మీద 201 కేజీలు లిఫ్ట్ చేసి రికార్డు సృష్టించింది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 113 కేజీలు లిఫ్ట్ చేసింది. ఈ క్రమంలో మహిళల 49 కేజీల విభాగంలో కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) రికార్డు సృష్టించింది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా భారత్‌కు తొలి స్వర్ణం అందించింది మీరాబాయినే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)