Take Your Condoms Home: కండోమ్‌లు ఇస్తాం, అయితే వాడకుండా ఇంటికి తీసుకువెళ్లండి, ఒలంపిక్స్ గేమ్స్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తామని తెలిపిన కమిటీ సీఈవో తోషిరో ముటో

కరోనా నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నామని, అందుకే కండోమ్‌లు ఇంటికి తీసుకెళ్లాలని ఈసారి ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఓ ప్రముఖ మీడియా హౌజ్‌ అడిగిన ప్రశ్నకు కమిటీ సీఈవో తోషిరో ముటో బదులిచ్చారు.

Take your condoms home

ఒలంపిక్స్ నేపథ్యంలో ఆటగాళ్లకు 1988 సియోల్‌ ఒలంపిక్స్‌ నుంచి హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా కండోమ్‌లు సరఫరా చేస్తున్న సంగతి విదితమే. అయితే కరోనా నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నామని, అందుకే కండోమ్‌లు ఇంటికి తీసుకెళ్లాలని ఈసారి ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఓ ప్రముఖ మీడియా హౌజ్‌ అడిగిన ప్రశ్నకు కమిటీ సీఈవో తోషిరో ముటో బదులిచ్చారు.

ఇదిలా ఉంటే ఈసారి ఆటగాళ్ల కోసం లక్షా యాభై వేల కండోమ్‌లను నిర్వాహకులు సిద్ధం చేశారు. కాగా, తాజా ప్రకటనతో ఆటగాళ్లు దూరంగా ఉండాలని, ఒలంపిక్‌ విలేజ్‌లో శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదని పరోక్షంగా హింట్‌ ఇచ్చారు. ఇక కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆటగాళ్లకు భోజన సదుపాయాలు అందించడం దగ్గరి నుంచి ప్రతీది ఈసారి ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం విధించారు కూడా.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement