Wimbledon 2023: వింబుల్డన్‌ 2023 విజేత కార్లోస్‌ అల్‌కరాజ్‌, ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ చేజార్చుకున్న నొవాక్‌ జొకోవిచ్‌

వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) ఓడిపోయాడు.

Novak Djokovic (left) and Carlos Alcaraz (right) (Photo credit: Instagram @djokernole and @carlosalcaraz)

వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్‌కరాజ్‌ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్‌పై నెగ్గాడు.

2022లో యూఎస్‌ ఓపెన్‌ సాధించిన అల్‌కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్‌కరాజ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్‌ జొకో విచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement