Rafael Nadal: ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్.. మూడేళ్ల పాటు ప్రచారకర్తగా బాధ్యతలు.. ఎంతో సంతోషంగా ఉందన్న టెన్నిస్ ఐకాన్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.
Newdelhi, Aug 26: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ (Rafael Nadal) భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) గా నియమితుడయ్యాడు. ఇన్ఫోసిస్ కు మూడేళ్ల పాటు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు నాదల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై నాదల్ స్పందించాడు. ఇన్ఫోసిస్ తో కలవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఇప్పుడు తాను ఇన్ఫోసిస్ గ్లోబల్ అంబాసిడర్ నని తెలిపాడు. తమ భాగస్వామ్యం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నానని నాదల్ పేర్కొన్నాడు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)