A J Brown Left Twitter: ట్విట్టర్‌కు భారీ ఎదురుదెబ్బ, కంపెనీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం, ఈ సారి ఏకంగా క్వాలిటీ హెడ్ గుడ్‌బై
Twitter Representational Image (Photo Credits : File Photo)

Washington, June 03: సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో (Twitter) రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కంపెనీ కంటెంట్‌ మోడరేసన్‌ పాలసీ హెడ్‌ ఎల్లా ఇర్విన్‌ (Irvin) రాజీనామా ప్రకటించారు. తాజాగా మరో ఉన్నత అధికారి సైతం కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌ బ్రాండ్‌ సెక్యూరిటీ అండ్‌ క్వాలిటీ హెడ్‌ ఏజే బ్రౌన్‌ (A J Brown) గుడ్‌బై చెప్పారు. ట్విట్టర్‌ ఎలోన్‌ మస్క్‌ రాజీనామా ప్రకటించిన తర్వాత.. ఇదే రెండో పెద్ద రాజీనామా కావడం విశేషం. మస్క గత నెలలో సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా లిండా యాకారినోను నియమించారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఉన్నతాధికారులు ట్విట్టర్‌ను వీడడం కొత్త సీఈవోకు కష్టాల పెంచే అవకాశాలున్నాయి.

Pornhub on Elon Musk's Device? మంచి రసికుడే, ఎలాన్ మస్క్‌ ఫోన్లో పోర్న్ వీడియోలు, ట్విట్టర్ నా ఫోన్ స్పేస్ తినేస్తుందంటూ చేసిన ట్వీట్‌తో విషయం వెలుగులోకి.. 

ప్రపంచ కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను (Twitter) కోనుగోలు చేసినప్పటి నుంచి సోషల్‌ మీడియా దిగ్గజం ప్రకటనదారులను నిలుపుకోవడంతో కష్టాలు పడుతున్నది. తాజాగా రాజీనామాలు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నది. ట్విట్టర్‌ను మస్క్‌ను కొనుగోలు తర్వాత 50శాతం ఆదాయం పడిపోయింది. ఏజే బ్రౌన్‌ కంటే ముందు ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ హెడ్‌ ఇర్విన్‌ రాజీనామా చేశారు. సెక్యూరిటీ చీఫ్ యోల్ రోత్ నవంబర్‌లో రాజీనామా చేశారు. ఆయన నిష్క్రమణ తర్వాత ఇర్విన్ బాధ్యతలు స్వీకరించారు. బ్రాండ్‌ సెక్యూరిటీ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ హెడ్‌ రాజీనామా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బ్రౌన్‌ రాజీనామాకు కారణాలు మాత్రం తెలియరాలేదు.