Tokyo Olympic Games 2020: బాధపడకండి, గెలుపోటములు సహజం, కాంస్యం కోసం పోరాడండి. హాకీ సెమీస్‌లో భారత్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

తదుపరి ఆడనున్న మ్యాచ్‌, భవిష్యత్‌ విజయాల కోసం ఆల్‌ ది బెస్ట్‌. తమ ఆటగాళ్లను చూసి భారత్‌ ఎల్లప్పుడూ గర్విస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు

Indian Men’s Hockey

ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన భారత పురుషుల హాకీ జట్టు వరల్డ్‌, యూరోపియన్‌ చాంపియన్‌ బ్రెజిల్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట్లో బాగానే ఆడినా చివరకు బెల్జియం డిఫెన్స్‌ ముందు ధాటికి 5-2 తేడాతో తలవంచక తప్పలేదు. అయితే, కాంస్యం కోసం జరిగే మరో మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం పతకంతో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ ఓటమిపై ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘మన పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలిపింక్స్‌లో వారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, జీవితంలో గెలుపోటములు సహజం. తదుపరి ఆడనున్న మ్యాచ్‌, భవిష్యత్‌ విజయాల కోసం ఆల్‌ ది బెస్ట్‌. తమ ఆటగాళ్లను చూసి భారత్‌ ఎల్లప్పుడూ గర్విస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఇక కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు.. ‘‘బాధ పడకండి బాయ్స్‌, మీరు ఇప్పటికే భారత్‌ను ఎంతో గర్వపడేలా చేశారు. ఇప్పటికీ ఒలింపిక్‌ మెడల్‌తో తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాంస్యం కోసం జరిగే పోరులో మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరచండి’’ అని ట్విటర్‌ వేదిగకా తన స్పందన తెలియజేశారు. హాకీ ఇండియా సైతం.. ‘‘మనసు పెట్టి ఆడాం. కానీ ఇది మన రోజు కాదు’’ అంటూ బ్రేకింగ్‌ హార్ట్‌ ఎమోజీని జతచేసింది. అదే విధంగా.. ‘‘కొన్నింటిలో గెలుస్తారు. మరికొన్నింటిలో ఓడతారు. అయినా మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు’’ అని మద్దతుగా నిలబడింది.

PM Modi Tweet

Kiren Rijiju Tweet

Hockey India Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

India Women Beat West Indies Women: టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif