WFI Membership Suspended: ప్రపంచ వేదికపై భారత్‌కు షాక్, డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు చేసిన యూడబ్ల్యూడబ్ల్యూ, ఎన్నికల నిర్వహణ ఆలస్యమే కారణం

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI ) సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ (UWW) వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

WFI Chief Brij Bhushan Sharan Singh (Photo Credit: ANI)

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI ) సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ (UWW) వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ.. డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్‌ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది’ అని భారత ఒలిపింక్‌ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు (Indian Wrestlers) రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది.

Here's News

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement