Building Collapsed in Anantapur: కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం, ముగ్గురు చిన్నారులతో సహా మహిళ మృతి, భవనం శిథిలాల కింద మరో 10 మంది
అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

భవనం శిథిలాల కింద 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద నుంచి ఆరుగురిని అధికారులు బయటకు తీశారు. ఎలాంటి పిల్లర్లు లేకుండా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండటమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న మరో రెండు ఇళ్లకు స్వల్ప ప్రమాదం జరిగింది. జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)