Corona in AP: ఏపీలో కొత్తగా 483 మందికి కోవిడ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు, ఇంకా 5,654 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 40,191 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 483 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 81, గుంటూరు జిల్లాలో 61, ప్రకాశం జిల్లాలో 55, పశ్చిమ గోదావరి జిల్లాలో 53 కేసులు గుర్తించారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 40,191 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 483 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 81, గుంటూరు జిల్లాలో 61, ప్రకాశం జిల్లాలో 55, పశ్చిమ గోదావరి జిల్లాలో 53 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం, కడప, అనంతపురం జిల్లాలలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 534 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,41,316 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,654 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,317కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)