AP Vote on Account Budget 2024: రూ.2లక్షల 86వేల 389కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్, రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లని తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది.
Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారని బుగ్గన తెలిపారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి బుగ్గన తెలిపారు.విభజన ఏర్పడిన అనంతరం ప్రతికూల పరిస్థితుల్లో కూడా పుంజుకుందని తెలిపారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వివరాలు
రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్.
రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు.
రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు.
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం.
Here's Budget Live
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)