Andhra Pradesh Assembly Session: మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

YS Jagan Mohan Reddy (Photo-Video Grab)

Vjy, July 22: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం (Andhra Pradesh Assembly Session) సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Speech) ప్రసంగించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ ప్రసంగం, వైసీపీ సభ్యులు వాకౌట్

అయితే.. వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి చించేశారు. దీంతో వైఎస్‌ జగన్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది. పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారు?’’ అంటూ నిలదీశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)