Chandrababu Delhi Tour Update: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ, దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు మ.1:30కి ఢిల్లీ వెళ్లనున్నారు.

Andhra Pradesh CM Chandrababu Delhi Tour Updates(X)

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు మ.1:30కి ఢిల్లీ వెళ్లనున్నారు.

మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు(Chandrababu Delhi Tour Update). ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.

మార్చి 6న, ఉదయం చంద్రబాబు(AP CM Chandrababu)... దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన "విశ్వ చరిత్ర" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 1:50 గంటలకు ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.

పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు

ఓ చానెల్‌ కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు చంద్రబాబు(Chandrababu Delhi Tour). అనంతరం తిరిగి ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం రానున్నారు . మార్చి 7న వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు అమోదం తెలపనుంది కేబినెట్.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement