Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు భూమి పూజ కోసం బయలు దేరిన ఏపీ సీఎం జగన్, అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి

రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు ఉన్నారు. రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది.

CM Jagan To Lay Stone For Ramayapatnam Port (Photo-Video Grab)

రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు ఉన్నారు. రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. సహాయ, పునరావాసానికి ఏపీ ప్రభుత్వం రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది. రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం ఏపీ ప్రభుత్వం చేపట్టింది. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది.రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now