CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల పై గంటకు పైగా చర్చలు

ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు

CM Jagan Meet PM Modi (Photo-PMO)

ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్నారు సీఎం జగన్. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Here's PMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement