CM Visits Flood Affected Areas: ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం, ప్రతి ఇంటికి రూ. 2,500, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు, తుపాను బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు మిఛాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు, తుపాను బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు హమీ ఇచ్చారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి రూ. 2,500 ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమన్నారు. ప్రతీ ఇంటికి వాలంటీర్ వచ్చి రూ. 2,500 ఇస్తారు. పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి, నేరుగా బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు. ఆ జిల్లాలో కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం వద్ద నీటిలో ఉన్న మిర్చి పంట, బుద్దాం వద్ద తుంగభద్ర కాల్వ పక్కనే నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)