YS Sharmila Questions to CM Jagan: జగన్ అన్న ఇచ్చింది దగా డీఎస్సీ, దమ్ముంటే నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరిన వైఎస్ షర్మిల

తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఇచ్చింది దగా డీఎస్సీయేనని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.

Andhra Pradesh Congress Chief Y. S. Sharmila (File Image)

Vjy, Feb 13: తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఇచ్చింది దగా డీఎస్సీయేనని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. ఆయన వారసుడిగా చెప్పుకొనే జగన్ ఆన్న కేవలం 6 వేల పోస్టులతో దగా డీఎస్పీ చేశారని విమర్శించారు.  మట్టిలోని మాణిక్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యం, ముగింపు వేడుకల్లో ప్రసంగించిన సీఎం జగన్

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?

2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?

3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యమేంటి?

4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?

5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధి మాత్రమేనా?

6. వైఎస్‌ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా?

7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?

8. రోజుకు 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?

9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష సాధింపు చర్య కాదా?

Here's Sharmila Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now