Sexual Harassment Case: యువతిపై లైంగిక వేధింపుల కేసు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌కు 14 రోజుల రిమాండ్
ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
ఇంట్లో పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపుల కేసులో కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చిందని సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కర్నూలు రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. వీడియో ఇదిగో, రేపు మీ కార్యకర్తలకు ఇదే గతి, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)