Andhra Pradesh Election 2024: టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నామని తెలిపిన బీజేపీ, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో దెప్పి పొడుస్తున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది.

TDP Alliance Releasing Manifesto

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇవాళ టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన తెలిసిందే. మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం

ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నేడు విడుదల చేసిన మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది.

Here's AP BJP Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)