Andhra Pradesh Elections 2024: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు, మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ, అధికారికంగా ప్రకటించిన వైసీపీ
అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
అనకాపల్లి లోక్‌సభ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి పేరును వైఎస్సార్‌సీపీ అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. మాడుగుల స్థానానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె. తిరుపతి టికెట్ జనసేనకు ఇవ్వడంతో ఏడ్చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని సూటి ప్రశ్న
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)