రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం..మంగళవారం రాత్రి మరో జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు. మరోవైపు కర్నూలు మేయర్ గా బీసీ వర్గానికి చెందిన సి.సత్యనారాయణమ్మను నియమించినట్టు వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు. ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను నియమించింది.తాజా ప్రకటనతో ఈ చేరికలు 77కు చేరింది.  ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)