TDP-Janasena BC Declaration: బీసీలకు పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు, 10 అంశాలతో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌ ఇదిగో..

బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టీడీపీ-జనసేన ప్రకటించాయి. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి.

TDP-Janasena BC Declaration (Photo-X)

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ ’ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టీడీపీ-జనసేన ప్రకటించాయి. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి.  మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణస్వీకారం, అక్కడి నుంచే పాలన, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వెల్లడి

బీసీ డిక్లరేషన్ పాయింట్లు...

1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు, పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు, పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు

3. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు

4. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు

5. బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు... సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు

6. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ

7. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం

8. అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్... కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం

9. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు... జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు

10. బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు... రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)