YS Jagan Mohan Reddy (Photo-YSRCP)

Visakha, Mar 5: విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా.. విశాఖలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై (Three Capitals) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ గెలిచి.. విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత తాను విశాఖలో (CM Jagan Visakha Visit) నివసిస్తానని మరోసారి చెప్పిన జగన్ (CM Jagan Mohan Reddy) విశాఖలో జరుగుతున్న అభివృద్ధీ, ఏపీలో అవకాశాల గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని అన్నారు. ప్రభుత్వం చెయ్యాల్సిందల్లా తుది మెరుగులు దిద్దడమే అన్నారు.  వైసీపీకి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాజీనామా, టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని వెల్లడి

విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌న కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజగ్‌ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు.రాష్ట్రంలో​ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

పులివెందులలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత సతీష్‌రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని వెల్లడి

వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్‌ నుంచే పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు.ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Here's AP CMO Tweet

ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో​ విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.

Here's CM Jagan Statement

చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్‌ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు.

కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్‌ అన్నారు.

అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్‌ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే సీఎం జగన్ చాలాసార్లు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖలో జరిగిన కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ.. తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని అన్నారు. కానీ ఇప్పటివరకూ అది జరగలేదు. గత ఏడాది డిసెంబర్ లోపే షిఫ్ట్ అవుతానన్న ఆయన.. అలా చెయ్యలేకపోయారు. కారణం.. అమరావతి అంశం కోర్టుల్లో ఉంది. కోర్టు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, అప్పుడు ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలన సాగించడం కష్టమవుతుంది. అందువల్ల కోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని జగన్ భావిస్తున్నారు. నెక్ట్స్ ఎన్నికల్లో గెలవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చి, విశాఖ నుంచి పాలన సాగించాలని ప్లాన్ వేసుకున్నట్లు ఆయన తాజా మాటలనుబట్టీ అర్థమవుతోంది.