Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఓటరు

తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు.

Andhra Pradesh Elections 2024: Clash Between Tenali MLA Shiv kumar and voter Watch Video

తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు. ఇది చూసి అక్కడ ఉన్న ఒక ఓటరు అభ్యంతరం చెప్పారు. అందరితో పాటు క్యూలో రావాలని సూచించారు. దీంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటర్ పై చేయిచేసుకున్నారు. ఓటర్ తిరిగి కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now