Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం

ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది

Election Commission (File Photo)

ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ( central election commission) బదిలీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది. ఆయా జిల్లాల ఎస్పీలను ఎన్నికలకు సంబంధం లేని పోస్ట్‌ల్లో నియమించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలను.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈసీ సీఈవో మీనా పంపారు.చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్‌లపై సీఈసీ వేటు వేసింది. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల

గుంటూరు రేంజ్ ఐజీ పాల్‌‌రాజ్‌ను సైతం ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్త మునియ్య హత్య నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీని ఈసీ బదిలీ చేసింది. అలాగే ప్రధాన మంత్రి సభలో భద్రత లోపాలపై గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్‌తోపాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై వేటు వేసింది. తమ కింది అధికారులకు బాధ్యతలు అప్పగించి.. విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)