Andhra Pradesh Elections 2024: గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు, పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, తనకు ప్రాణహాని ఉందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు తెలుస్తోంది.

గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లడం తెలిసిందే. అప్పుడు విచారణ అధికారిగా ఉన్నది లక్ష్మీనారాయణే. ఈ నేపథ్యంలో, ఇవాళ విశాఖ సీపీని కలిసిన లక్ష్మీనారాయణ... విశాఖలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. నేను ఏ ప్యాకేజీ తీసుకోలేదంటూ రేణు దేశాయ్ పోస్ట్, మా నాయకుడిని ఉద్దేశించి ఆ ప్యాకేజీ పోస్ట్ అంటూ మండిపడతున్న పవన్ ఫ్యాన్స్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)