రానున్న లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలతపై రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. మాధవీలత ఫొటోను షేర్ చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశామని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి నుంచి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్ చేశారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నానని... ఆ విషయాన్ని చెప్పానని అన్నారు. త‌మ‌న్నాకు సైబ‌ర్ పోలీసుల నోటీసులు, ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ప్ర‌సారం చేసిన కేసులో విచార‌ణ‌కు రావాల‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ పోలీసుల పిలుపు

రేణు చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్యాకేజ్ గురించి ఆమె మాట్లాడటంపై కొందరు మండిపడుతున్నారు. పవన్ ను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు తావిచ్చాయి. పవన్ ను టార్గెట్ చేస్తూనే ఆమె పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు

Here's Her Post

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)