Tamannaah Summoned by Maharashtra Cyber: త‌మ‌న్నాకు సైబ‌ర్ పోలీసుల నోటీసులు, ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ప్ర‌సారం చేసిన కేసులో విచార‌ణ‌కు రావాల‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ పోలీసుల పిలుపు
Tamannaah Bhatia (Photo-ANI)

Mumbai, April 25: ప్రముఖ నటి తమన్నా భాటియాకు (Tamannaah Bhatia) మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023 (IPL) మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినందుకుగాను ఈ నెల 29న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్న చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లినట్లు ప్రసార హక్కులు కలిగిన వయాకమ్‌ ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తాఖీదులిచ్చారు. ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకమ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 

కాగా, ఇదే కేసులో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కు (Sanjay Dutt) కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 23న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. తాను ఆ రోజున దేశంలో లేనని పేర్కొన్నారు. దీంతో తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని ఆయన పోలీసులను కోరారు.