MLA Burra Madhusudan Yadav: వీడియో ఇదిగో, సీటు ఇవ్వకపోయినా జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటాను, పార్టీ మార్పు వ్యాఖ్యలను ఖండించిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు.

Kanigiri MLA Burra Madhusudan Yadav (Photo-Video Grab)

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. నేను జీవితాంతం జగన్‌తోనే ఉంటానని తెలిపారు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.

కనిగిరిలో కొత్త ఇంచార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌కు పూర్తిగా సహకరిస్తానని మధుసూదన్‌యాదవ్‌ పేర్కొన్నారు. సీఎం జగన్‌ చెప్పిన వారి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు. నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి. నా రాజకీయ దేవుడు వైఎస్‌ జగన్ ఏం చెబితే అది చేస్తా. నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు. కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం’ అని తెలిపారు.కనిగిరి కొండమీద వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. నరసారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్‌, ఏడు మందితో వైసీపీ ఐదో జాబితా లిస్టు ఇదిగో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement