Chandrababu on Volunteer System: వీడియో ఇదిగో, వాలంటీర్ల ఉద్యోగాలు తీసేయం, మేము అధికారంలోకి వచ్చినా ఆ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపిన చంద్రబాబు
టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వాలంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా అని అన్నారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పెనుకొండ 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన ఎలా ఉంది? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే, జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చారు అంటూ చంద్రబాబు విమర్శించారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వాలంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా అని అన్నారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)