Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో టీడీపీ జెండాలను తగలబెట్టిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ప్రకటనతో భగ్గుమన్న తెలుగు తముళ్ళు వీడియోలు ఇవిగో.
కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు
కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశమవుతానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వర్మ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో భగ్గుమన్న నిరసన జ్వాలలు, టీడీపీ జెండాలు,ఫ్లెక్సీలను దహనం చేసిన ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)