Suryaprakash Joins YSRCP: వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్, ఆరేళ్లలో అరగంట కూడా నాతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మండిపాటు
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై మండిపడ్డారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై మండిపడ్డారు. పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా? అని పవన్‌ను ప్రశ్నించారు. జనసేనలో నేను పని చేసిన ఈ ఆరేళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు. సామాజిక న్యాయం గురించి పవన్‌కు ఏమాత్రం తెలియదు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు’’ అని సూర్యప్రకాష్ అన్నారు. వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, కర్నూలు అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)