Gollapally Surya Rao Resigns TDP: రాజోలులో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు

టీడీపీకి మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

Gollapally Surya Rao Resigns From Telugu Desam Party (Photo-File Image)

టీడీపీకి మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, రాజోలులో సీటు ఇవ్వకుండా తనను అవమానించారని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. గొల్లపల్లి త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో జాయిన్‌ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.  వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ బరిలో కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఉంటారని వెల్లడి

Here's Resigns Letter

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now