ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైసీపీకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.. ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
మాగుంట రాజీనామాతో కొద్దిరోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడినట్లయింది. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్‌కుమార్ (కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), రఘురామకృష్ణరాజు (నర్సాపురం)తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
Here's Video
బిగ్ బ్రేకింగ్ న్యూస్…🔥🔥🔥🔥
కంటతడి పెట్టుకున్న మాగుంట..
వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
ఒంగోలు ఎంపీగా మా అబ్బాయి మాగుంట రాఘవ రెడ్డి పోటీ చేస్తాడు.
త్వరలో టీడీపీ లో చేరే అవకాశం @YSRCParty pic.twitter.com/NmuMRDIvYL
— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) February 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)