Andhra Pradesh Elections 2024: దారుణం, వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన

కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు ఓ కసాయి కొడుకు.

TDP activist killed his mother because she voted for YSRCP

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు ఓ కసాయి కొడుకు. వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తిరుగుతుండగా తల్లి వడ్డే సుంకమ్మ(45) వైఎస్సార్సీపీ పార్టీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పగా కోపంతో ఊగిపోతూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు.  చంద్రబాబు సీఎం కావాలంటూ వెంకటేశ్వరస్వామి ముందు నాలుక కోసుకున్న వీరభక్తుడు, గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఇలాంటి పనే..

క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య చేశాడు.సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif