ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత 10 సంవత్సరాలలో ఆయన బాగా పనిచేశారని వెల్లడి

ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలోనూ మహేశ్ ఇలాంటి పనే చేసినట్టు పోలీసులు తెలిపారు.

Andhra Pradesh Elections 2024: hyderabad-man-attempts-to-cut-his-tongue-for-chandrababu-naidu-victory

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)