Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జై చంద్రబాబు అనకుండా జై జగన్ అనేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక్కసారిగా షాక్ తిన్న తెలుగుదేశం కార్యకర్తలు
కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు
కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు. వెంటనే ఆమె జై చంద్రబాబు అంటూ తన తప్పిదాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. గౌరు చరిత జై జగన్ అనేయడంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన గౌరు చరితకు.. 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ సీటును నిరాకరించారు. ఆమె బదులు కాటసాని రాంభూపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె టీడీపీలో చేరి సీటు దక్కించుకున్నారు. వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)