ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌. రాయచోటి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్.రమేష్ కుమార్ రెడ్డి తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసమ్మతికి గురయ్యారు. ఐదేళ్లుగా ఇన్చార్జిగా పార్టీ కోసం చేసిన కష్టం కనిపించలేదా అంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో చేరిన పోతిన మహేష్, విజయవాడ వెస్ట్‌లో జనసేనకు బిగ్ షాక్, వీడియో ఇదిగో..

ఆయనను కాకుండా మరో నేత రామ ప్రసాద్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అయినా అధిష్టాన ముఖ్య నేతలు ఆయనను సంప్రదించి సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఆ స్థాయిలో జరగలేదు.ఈ పరిణామాలు నేపథ్యంలో రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి మంగళవారం రాజీనామా చేశారు.తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)