Pothina Mahesh Joins YSRCP: జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్‌ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. 12వ రోజు 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. గంటావారిపాలెం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం..
Here's Video
విజయవాడలో జనసేన క్లోజ్!
జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగనన్న సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిక@ncbn మాటలు నమ్మి విజయవాడ వెస్ట్ టికెట్‌ను @BJP4Andhra అభ్యర్థి సుజనా చౌదరికి అమ్ముకున్న @PawanKalyan
పోతిన మహేష్ పార్టీని… pic.twitter.com/btbKQ064mt
— YSR Congress Party (@YSRCParty) April 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)