
మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైయస్ఆర్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయస్ఆర్‌సీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్ , అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.