Andhra Pradesh: కృష్ణానదిలో అయిదుగురు విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం, మరో నలుగురు కోసం గాలిస్తున్న పోలీసులు, గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తింపు

విజయవాడ కృష్ణానదిలో అయిదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. యనమలకుదురు దగ్గర ఘటన జరిగింది. ఈతకు వెళ్లి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించారు.

Five students drown in Krishna river (Photo-ANI)

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విజయవాడ కృష్ణానదిలో అయిదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. యనమలకుదురు దగ్గర ఘటన జరిగింది. ఈతకు వెళ్లి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించారు.ఈ రోజు మధ్యాహ్నం ఈత కొట్టడానికి కృష్ణానది దిగువ పాయలకు విద్యార్థులు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లినట్టు సమాచారం. క్షేమంగా ముగ్గురు విద్యార్థులు బయటపడ్డారు. గల్లంతైన ఐదుగురిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, అధికారులు చేరుకున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)